NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

1 min read

వివిధ సేవల ద్వారా రూ:1,27,873/-లు ఆదాయం

ఎమ్మెల్యే కి ఆలయ

మర్యాదలతో స్వాగతం,శేష వస్త్రము అందించి తీర్థ ప్రసాదాలు అందజేత

కార్యనిర్వాహణాధికారిణి  ఆర్.వి.చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న కొవ్వూరు  శాసనసబ్యులు  ముప్పిడి వెంకటేశ్వరావుస్వయంభూః  శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం మంగళవారం హనుమన్నామ స్మరణతో మార్మోగింది.   తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు  అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.  స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులుదీరి స్వామివారిని  దర్శించుకున్నారు. ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు  చెల్లించుకున్నారు.  మంగళవారం మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల, విరాళాల  ద్వారా   రూ 1,27,873/-లు  సమకూరినది. కొవ్వూరు  శాసనసబ్యులు  శ్రీ ముప్పిడి వెంకటేశ్వరావు  స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయమునకు విచ్చేసిన  వారిని అర్చకులు, కార్యనిర్వహణాధికారిణి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామివారి  ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు.  అనంతరం ఆలయ మండపం వద్ద అర్చకులు  వేద ఆశీర్వచనం చేసి,స్వామివారి చిత్రపటం,శేషవస్త్రము, ప్రసాదములు అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు  స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద   వితరణ  చేశారని దేవస్థానం కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.

About Author