NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సురవరం సుధాకర్ రెడ్డి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్రలోటు

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:   సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి జీవితాంతం కార్మిక కర్షక మరియు అట్టడుగు వర్గాల  అభ్యున్నతిని కాంక్షిస్తూ పోరాటాలను నిర్వహించిన కమ్యూనిస్టు మేరు నగదీరుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి  మరణం వామపక్ష ఉద్యమానికి తీవ్రలోటని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి వీరశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మేరకు శనివారం నాడు పత్రిక ప్రకటన చేస్తూ  సంప్రదాయ కమ్యూనిస్టు కుటుంబం లో పుట్టి వారసత్వంగా ఎర్రజెండా పట్టిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి  తన బాల్యం నుండే పేదల కోసం, దోపిడి గురవుతున్న వారి కోసం విద్యార్థి ,యువజన, కార్మిక ,మహిళల హక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు సామాన్య స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు  ప్రజా సంఘాల్లోనూ కీలక బాధ్యత  నిర్వహించి పార్టీ అఖిలభారత స్థాయి వరకు కీలకమైన బాధ్యతలు నిర్వహించారని ఈ దేశంలో రెండవ తరం నాయకత్వంగా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి  కామ్రేడ్ సీతారాం ఏచూరి  వామపక్ష ఉద్యమానికి దోహదపడ్డారని పేర్కొన్నారు దోపిడి గురవుతున్న వర్గాలకు అండగా కార్పొరేట్ రాజకీయాల వ్యతిరేకంగా పోరాడమే అమరులకు కమ్యూనిస్టులుగా మనం ఇచ్చే నివాళి అని ఆయన పేర్కొన్నారు.

About Author