ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికీ ఆదర్శప్రాయం
1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కె.వెట్రిసెల్వి అన్నారు. జిల్లా కలెక్టరేటులో శనివారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ నేతలు ఎంతమంది ఉన్నను ప్రజాభిమానాన్ని చూరగొనేది మాత్రం కొందరేనని, అలాంటి కొద్దిమంది నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు చిరస్మరణీయులుగా నిలుస్తారని అన్నారు.ఆంధ్రకేసరిగా స్వాతంత్ర్య సమరాగ్నిని రగిలించి,తెలుగు నేలను ఉర్రూతలూగించి స్వాతంత్రోద్యమ బాట పట్టించారన్నారు.తన యావదాస్తిని ఉద్యమానికే ధారపోసిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నేడు ఊరువాడా జరుపుకుం టోందన్నారు.టంగుటూరి ఆంధ్రకేసరిగా ప్రసిద్ధి చెందారని ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా చేశారని భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు.తన జీవితాన్ని దేశం కోసం, ప్రజలు కోసం అంకితం చేశారన్నారు. తెలుగు వారిలో స్వాతంత్య్ర జ్వాల రగిలించిన ధీరోదాత్తుడు,త్యాగమూర్తి టంగుటూరి ప్రకాశం పంతులన్నారు.ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు గుర్తు చేశారు.ఆయన పేరును ప్రకాశం జిల్లాగా నామకరణం చేయడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంటు కె.చల్లన్నదొర, రెవిన్యూ ఉద్యోగులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

