NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంను గుర్తుపెట్టుకోండి..ఆశీర్వదించండి

1 min read

నందికొట్కూర్ ఎమ్మెల్యే జయసూర్య

ఎకనామిక్ ఇండిపెండెంట్ గా ఉండాలనేదే సీఎం తపన

మాండ్ర శివానందరెడ్డి..

నందికొట్కూరు , న్యూస్​ నేడు: మహిళల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు అనునిత్యం తపన పడుతున్నారని ముఖ్యమంత్రిని గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో సీఎంను ఆశీర్వదించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మహిళలతో అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ లో శనివారం స్త్రీ శక్తి అనే కార్యక్రమం మహిళలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకాన్ని మహిళలకు నెరవేర్చడం జరిగిందని మహిళలను నూతన విప్లవంలా తీసుకురావాలన్నదే సీఎం ద్యేయమని ఆయన వేసే ప్రతి అడుగు మహిళల అభివృద్ధి కోసమే..సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళలతో ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది మహిళలను ఎకనామిక్ ఇండిపెండెంట్ గా చేసే దిశగా సీఎం వెళ్తున్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని మాండ్ర శివానందరెడ్డి అన్నారు.101 పొదుపు సంఘాలకు 7 కోట్ల 40 లక్షల రుణాలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, దేవళ్ల మురళీ,జనసేన రవికుమార్,రమేష్ రెడ్డి, మహేశ్వర రెడ్డి,జాకీర్ హుస్సేన్,ముర్తు జావలి,డాక్టర్ వనజ,ఆర్టీసీ అధికారులు, వెలుగు సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు.

About Author