డీఎస్సీ నియామక ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి
1 min read

యస్.శ్యామ్యూల్ పాల్
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లావ్యాప్తంగా డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులు 2600 మంది ఉన్నారని నియామక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాధికారి ఎస్ శ్యామ్యూల్ పాల్ అన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం లోని డీఎస్సీ ధృవీకరణ పత్రాల కేంద్రాన్ని పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు సంబంధించి 54 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకోసం 250మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై నియమించామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తం వచ్చే ఏ అభ్యర్థి ఇబ్బందులు పడకుండా హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు సంబంధించి జిల్లాలో మూడు కేంద్రాలను ఎంపిక చేసామని రాఘవేంద్ర బి.ఎడ్ కాలేజీ శ్రీనివాస బీఎడ్ కాలేజీ రాయలసీమ విశ్వవిద్యాలయం ఈ మూడు కేంద్రాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని అన్నారు. అభ్యర్థులకు రూట్ మ్యాప్ ఏ సబ్జెక్టు అభ్యర్థులు ఎక్కడికి వెళ్లాలి ఏ కేంద్రాల్లో పరిశీలనకు తమ దృక్పత్రాలు సమర్పించాలనే వివరాలు వారి చరవాణికి ఇప్పటికే సందేశం పంపడం జరిగిందన్నారు. పైన పేర్కొన్న కేంద్రాల్లో అన్ని వసతులు ఉన్నాయని అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఇవ్వలేదని అన్నారు. సకాలంలో వచ్చి విద్యాశాఖ సూచించిన అన్ని ధ్రువపత్రాలు గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో మూడు సెట్లు సమర్పించాలని అన్నారు. డీఈవో తో పాటు మండల విద్యాధికారులు బోరెల్లి నాగరాజు, శ్రీధర్ బాబు, సిబ్బంది ఉన్నారు.

