NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ రెడ్డి

1 min read

ఉత్తర్వులు జారీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్​

  • హర్షం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు

కర్నూలు, న్యూస్​ నేడు: BJYM రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూల్ కి చెందిన యెస్.  సునీల్ కుమార్ రెడ్డి ని నియమిస్తూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సౌలహళ్లి గ్రామానికి చెందిన సునీల్​ రెడ్డి విద్యార్థి దశ నుండి  ఏబీవీపీ కార్యకర్తగా ఆదోని లో ఆర్ట్స్ కళాశాల అధ్యక్షుడుగా ఆదోని మండల కన్వినిర్ గా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.ఆదోని లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అనేక రకాలైన ఉద్యమాలు చేసారు.2010 నుంచి 2014 కేంద్రంలోని అవినీతి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా YAC “YOUTH AGAINST CORRUPTION” పేరుతో అవినీతి వ్యతిరేక ఆందోళనలో జిలా రథయాత్ర నిర్వహించారు.ఆదోని రూరల్ గ్రామాల విద్యార్థులకు బస్ లు నడపాలని నిరసన కార్యక్రమాలు చేశారు. మహిళా జూనియర్ కళాశాల మైదానంలో ఆకతాయిలు ఆటకట్టించడానికి పోలీస్ వారితో ఎన్నో రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కర్నూల్ జిల్లా కో- కన్వీనర్ గా  మరియు జిల్లా కన్వీనర్ గా కర్నూలు కేంద్రంగా పనిచేశారు.జిల్లాలోని మారుమూల ఆయన పాములపాడు,జూపాడుబంగ్ల, ఆస్పరి, హోళగుంద ఆలూరు, శ్రీశైలం బండి ఆత్మకూరు లాంటి ప్రాంతాల్లో ఎబివిపి కమిటీ లు చేసి కాషాయ జెండా ఎగురవేసారు. కమ్యూనిస్టు విద్యార్థి సంఘం కంచుకోటలుగా పేరున్న డోన్, కోడుమూరు లాంటి ప్రాంతాల్లో సైతం ABVP కి పూర్వ వైభవం తీసుకుని వచ్చారు.2011 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా కర్నూల్ లో రాయలసీమ యూనివర్శిటీ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించారు. రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధి కై 100 నిధులు కేటాయించాలని కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేశారు.2012 లో BEd కోర్సు చేసిన వారికి SGT అవకాశం కల్పించాలని కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ అరెస్ట్ అవడం వారం రోజుల పాటు సబ్ జైల్ లో ఉండటం జరిగింది.2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గా నెల్లూరు రాష్ట్ర మహాసభల్లో ఎన్నికై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాల విద్యలో రావాల్సిన మార్పులు సంస్కరణల కోసం ఉద్యమాలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ నిధులు ఇవ్వాలని రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేసి సాధించారు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలు కేంద్ర ప్రభుత్వ స్కీముల ద్వారా ఉపాధి శిక్షణ కేంద్రాలు నెలకొల్పేలా భూమిక పోషించారు.జాతీయ కార్యవర్గ సభ్యులు తిరుపతి కేంద్రంగా పూర్తి సమయం ABVP ఉద్యమాలలో పాల్గొంటూ రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తూ ఎంతో మంది ఎబివిపి కార్యకర్తల అభిమామాలను చూరగొన్నారు. అనేక విద్యార్థి సమస్యల పైన ఉద్యమాలు చేసి కేసుల పెట్టించుకొని అనేక సమస్యల పైన పోరాటాలు చేయడం జరిగింది.అనంతరం 2017 లో బీజేపీ లో చేరి BJYM రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా అనేక సమస్యల పైన ఉద్యమాలు చేసారు.పలు ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు.

కార్యకర్తలు, నాయకుల్లో సంబరం..

సాదరణ కుటుంబం నుండి వచ్చిన  బీజేపీ యువజన విభాగం BJYM రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడటం హర్శించదగ్గ విషయం అని కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామక్రిష్ణ ,ఆదోని శాసనసభ్యులు పార్థసారథి, సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య,మాజీ జిల్లా అధ్యక్షులు GSనాగరాజు, రామస్వామి, ప్రేమ్ కుమార్, కాశీ విశ్వనాథ్ , సాయి ప్రదీప్ కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికైన సందర్భంగా మాతృసంస్థ ఎబివిపి కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు మహేంద్ర ,సూర్య ,మహేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఎబివిపి సంభాగ్ ప్రముఖ్ నాగఫణి శాస్ర్తి,విభాగ్ కన్వీనర్ ఎర్రిస్వామి మరియు కార్యకర్తలు సన్మానించారు.

About Author