ఎస్ జి టి టీచర్ పోస్ట్ జిల్లా టాపర్ లావణ్యను సన్మానించిన సిపిఎం
1 min read

డీఎస్సీలో ఎస్ జి టి పోస్టు సాధించిన బి. లావణ్య కు సిపిఎం పార్టీ నాయకులు అభినందనలతో సన్మానం
పత్తికొండ, న్యూస్ నేడు: ఇటీవల కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీ ఫలితాల్లో జిల్లా టాపర్గా నిలిచిన లావణ్యను స్థానిక సిపిఎం పార్టీ ఘనంగా సన్మానించింది.పత్తికొండ నియోజకవర్గం, తుగ్గలి మండలం, జి ఎర్రగుడి గ్రామానికి చెందిన బి. పెద్ద పుల్లయ్య(లేట్) బి. కృష్ణవేణి, దంపతుల పెద్ద కుమార్తె బి లావణ్య 2025 డీఎస్సీ ఫలితాల విడుదల్లో 94.53202 మార్కులు సాధించి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచి ఎర్రగుడి గ్రామానికి పేరు తీసుకురావడం గర్వకారణమని సిపిఎం నాయకులు కొనియాడారు. ప్రజానాట్మండలి జిల్లా నాయకులు పి. ఖాసిం, పత్తికొండ మండలం సిఐటియు కార్యదర్శి ఎం. రవిచంద్ర, తుగ్గలి మండలం రైతు సంఘం కార్యదర్శి కొండారెడ్డి డీఎస్సీ జిల్లా టాపర్ లావణ్యనుశాలువా కప్పి, సన్మానించి, అభినందనలు తెలిపారు. జి. ఎర్రగుడి గ్రామంలో సన్నకారు రైతు కుటుంబానికి చెందిన పి. పెద్ద పుల్లయ్య (లేట్) పిల్లల చిన్నతనంలోనే తండ్రి యాక్సిడెంట్లో మరణించినా ఆయన భార్య బి. లక్ష్మీదేవి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత చదువులు చదివించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడం ఎంతో గర్వకారణం అని వారన్నారు. లావణ్య కుటుంబానికి సిపిఎం నిత్యం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు లావణ్యను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ కొలువులను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బి చంద్రశేఖర్ యాదవ్, బి. ఏకాంబరం, బాలసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

