పిజిఆర్ యస్ లో జిల్లా కలెక్టరు కి దెందులూరు ఎమ్మెల్యే అర్జీ
1 min read

ప్రతి సొసైటీ కి యూరియా రైతులకు సరఫరా చేయాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం పిజిఆర్ యస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి కి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆర్జీని ఇచ్చారు.దెందులూరు నియోజకవర్గంలో యూరియా కొరత ఉందని, ప్రతి సొసైటీకి అవసరమైన యూరియా స్టాకును పంపించి, రైతులకు అవసరానికి తగ్గట్టుగా సరఫరా చేయాలన్నారు. రైతులకు ఎరువుల అందించడంలో కోపరేటివ్ సొసైటీలో ఆధారు కార్డు చూపించమని ఓటిపి కారణాలతో జాప్యం జరుగు తుందని, సమస్యని పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలో సదరం స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేసి మిగిలి ఉన్న దివ్యాంగులకు సర్టిఫికెట్ల జారీ ని వేగవంతం చేసి, పెన్షన్లు మంజూరుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

