పెండింగ్ డి.ఎ లు,ఐఆర్ 30% తక్షణమే ప్రకటించాలి…
1 min read

రమేష్ నాయుడు యూటీఎఫ్ ప్యాపలి మండల అధ్యక్షులు
ప్యాపిలి, న్యూస్ నేడు: యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ ఆధ్వర్యంలో ప్యాపలి లో 2 వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బావిపల్లి పాఠశాలనుండి ప్రారంభించడం జరిగింది.బావిపల్లి లో యూటీఎఫ్ మండల అధ్యక్షులు రమేష్ నాయుడు మాట్లాడుతూప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎ లు, పిఆర్పీ మరియు ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా హామీ అమలు కాకపోవడమే కాక ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయకుండా యాప్ ల పేరు తో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ రోజు రోజుకు కొత్త కొత్త చెత్త ప్రయోగాలు కేవలం విద్యా వ్యవస్థ లోనే తీసుకు రావడం దేనికి సంకేతము అని ఆయన ప్రభుత్వాని గట్టిగా ప్రశ్నించారు.పరీక్షా విధానం కూడా పూర్తిగా పాత పద్దతి లోనేకొనసాగించాలని,అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆయన అన్నారు.దసరా లోపు డిఎ మరియు ఐఆర్ 30% ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ నీ నెరవేర్చాలని ఆయన కోరారు.కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్, సర్వజ్ఞ మూర్తి, మదన్ గోపాల్, ఆంజనేయ ప్రసాద్, విశ్వనాథ్ రెడ్డి,ఇబ్రహీం,సాలయ్య,మద్దిలేటి,నందీశ్వర రెడ్డి,రాజేంద్ర,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

