NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూర్ ను కర్నూలు జిల్లాలోనే కలపాలి..

1 min read

నంద్యాల వద్దు..కర్నూలు ముద్దు

విద్యార్థులతో కలిసి సీపీఐ ధర్నా..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండానే గతంలో నందికొట్కూరును నంద్యాల జిల్లాలో కలిపారని ప్రస్తుత ప్రభుత్వం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేస్తూ నంద్యాల వద్దు..కర్నూలు ముద్దు అంటూ నందికొట్కూరు పట్టణంలో గురువారం విద్యార్థులతో కలిసి  సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు ధర్నా చేశారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం ఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి, కేవలం 30 కి.మీ దూరంలో ఉన్న కర్నూలు జిల్లాకు కాకుండా,60 కి.మీ దూరంలో ఉన్న నంద్యాల జిల్లాకు కలపడం వల్ల రైతులు, విద్యార్థులు,సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యం కోసం,విద్యా,ఉపాధి అవకాశాల కోసం, నందికొట్కూరును కర్నూలు జిల్లాతో అనుసంధానం చేయాల్సిన అత్యవసరం ఉందన్నారు.కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రులు, విశ్వ విద్యాలయాలు,ఉద్యోగ అవకాశాలు నందికొట్కూరు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్నాయనినందికొట్కూరును కర్నూలు జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని తక్షణం డిమాండ్ చేశారు.వీటిపై త్వరలోనే ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.తర్వాత తహసిల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు.అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మార్వో శ్రీనివాసులు కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం తాలూకా అధ్యక్షుడు గాబ్రియేలు,ఏసన్న, సుధాకర్,శీలన్న,మహిళా సంఘం నాయకులు లక్ష్మిదేవి, మూర్తుజాభి తదితరులు పాల్గొన్నారు.

About Author