NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గణేష్ ఉత్సవాలలో మట్టి వినాయక ప్రతిమలను వినియోగిద్దాం

1 min read

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదాం

మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన వైఎస్ఆర్ సీపీ నాయకులు

చెన్నూరు , న్యూస్ నేడు:  చెన్నూరు  గణేష్ ఉత్సవాలలో మట్టి వినాయక ప్రతిమలను వినియోగిద్దాం పర్యావరణ పరిరక్షణలో మనమంతా భాగ్యస్వామ్యం అవుదామని వైఎస్ఆర్సిపి కమలాపురం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి తెలిపారు. గురువారం వైఎస్ఆర్సిపి కమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పోచం రెడ్డి నరేన్ రామాంజుల రెడ్డి ఆదేశాల మేరకు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని చెన్నూరు రెండవ సెగ్మెంట్ లో గల 7, 8, 9, 10 వార్డులకు సంబంధించి శివాలయం వీధిలో వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి గుమ్మల సాయి కుమార్ రెడ్డి మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో మనమంతా భాగస్వామ్యం కావాలని అందుకే మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగిద్దామని, ప్లాస్టిక్ రహిత సమాజానికి తోడ్పడదామని ఆయన అన్నారు. మనమందరం గణేష్ ఉత్సవాలలో పర్యావరణ సహిత మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రజల్లో ప్రోత్సహిస్తూ, వారికి అవగాహన కలిగే విధంగా ఆవరణంలో ప్లాస్టిక్ వల్ల ఏర్పడే ఇబ్బందులను గురించి వివరించాలని ఆయన కోరారు. ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల నష్టాలను గురించి ఆయన వివరించారు. వీటివల్ల చెరువులు, నదులు ఇతర  జన వనరులు కాలుష్యం కావడంతో, తద్వారా ఎన్నో జీవరాసులకు ప్రాణహాని కలుగుతున్నదని ఆయన తెలియజేశారు. మట్టి విగ్రహాలు వాడటం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు చీర్ల సురేష్ బాబు, టిఎన్ చంద్రరెడ్డి, పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు T. రవీంద్ర రెడ్డి( మెడికల్ రవి) మండల రైతుసంఘం అధ్యక్షులు యరసాని నిరంజన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author