రామనపల్లెలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
1 min read

మహిళలకు ముగ్గుల పోటీలు- బహుమతుల ప్రధానం
సీఐ, తాహాశిల్దార ను సన్మానించిన ఉత్సవ కమిటీ సభ్యులు
చెన్నూరు , న్యూస్ నేడు: మండలంలోని రామనపల్లె గ్రామంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. గురువారం ఉదయం 6:30 గంటలకు గణపతి ప్రత్యేక పూజ, ప్రసాద వితరణ గావించారు. అలాగే ఉదయం ఏడున్నర గంటలకు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మొదటి బహుమతిగా రూ3016లు, రెండవ బహుమతిగా రూ 2016 లు మూడవ బహుమతిగా రూ1016లు ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 11 గంటలకు అన్న ప్రసాద వితరణ సాయంత్రం ఐదు గంటలకు మ్యూజికల్ చైర్స్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ ఎం కృష్ణారెడ్డి. తాహాశిల్దార్ సరస్వతి పాల్గొని ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులు సీఐ కృష్ణారెడ్డికి,తహశీల్దార్ సరస్వతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


