NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర జన్మదిన వేడుకలు

1 min read

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :స్థానిక  జేవియర్ నగర్ బిషప్ హౌస్ నందు మోస్ట్ రెవరెండ్ డాక్టర్:జయరావు పొలిమేర  జన్మదిన వేడుకలు అమలోద్భవి మేత్రాసానంలో అంగరంగ వైభవంగా కనులు పండుగ నిర్వహించారు. ఈ జన్మదిన కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూల బొకే అందించి,శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఐదుగురు కి గురు పట్టాభిషేకం నిర్వహించి ఆశీర్వదించారు. ఫాదర్: పి.బాల,ఫాదర్:జి. మోజేష్, ఫాదర్:ఐ మైఖేల్ ఫాదర్:తాతిపూడి ఇమ్మానుయేలు, ఫాదర్:జార్జ్, ఫాదర్:రాజు మరియు అనేక ప్రాంతాల నుండి విచ్చేసిన ఫాదర్లు, సిస్టర్స్, దైవజనులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి,టిడిపి సీనియర్ నాయకులు బెల్లపు కొండ కిషోర్, లంకపల్లి మాణిక్యాలరావు,జుంజు మోజేష్ పాల్గొన్నారు.

About Author