శ్రీ సరస్వతీ శిశు మందిరం లో మాతృ భాష దినోత్సవం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి శ్రీ సరస్వతీ శిశు మందిరం లో మాతృ భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం. రెండు కార్యక్రమాలు నిర్వహించారు. మొదట మాతృ భాష దినోత్సవం పాఠశాల సహాప్రధానాచార్యులు వాసు గిడుగు రామమూర్తి చిత్ర పటానికి పూజ నిర్వహించి, గిడుగు రామమూర్తి 1823లో శ్రీకాకుళం జిల్లాలో ఆగష్టు 29 న జన్మించారని తల్లి వెంకమ్మ, తండ్రి వీర్రాజు వీరికి జన్మించాడు అని తెలిపారు. ఈయన తెలుగు భాష లిపి కనుగొన్నాడని తెలిపిరి. రాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల గురించి తెలియజేసారు. చిన్నారులు తెలుగు భాష తియ్యదనం పాటకు నృత్యం చేశారు. చిన్నపిల్లలు తెలుగు పద్యాలు పాడారు.జాతీయ క్రీడా దినోత్సవం హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ జన్మించిన సందర్బంగా క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం అని చెప్పారు.. ఈయన ఒక సైనికుడు అని కానీ హాకీ ఆట ఎంతో ఇష్టం అని తెలియచేసారు. ఈయన పేరు ధ్యాన్ సింగ్. కానీ ఈయన చంద్రుని వెన్నెలలో హాకీ ఆడడం వలన ఆయన కోచ్ ధ్యాన్ చంద్ అని పేరు పెట్టారు. తరువాత పాఠశాల లో పిల్లలు అందరి చేత ఆటలు ఆడించారు. ఆచార్యులు ఆటలు ఆడారు.ఈ కార్యక్రమం లో ఆచార్యులు, పిల్లలు పాల్గొన్నారు.


