ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 25లక్షల,87వేల,894 రూపాయల చెక్కులు పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇదేసమయంలో ప్రజలకు మరిన్ని మేళ్ళను చేకూర్చిపెట్టే లక్ష్యందిశగా పయనిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వాధినేతలు ముందుకెళ్తున్నారన్నారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతోన్న 34 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 25లక్షల, 87వేల, 894 రూపాయల విలువైన చెక్కులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేశారు. అలాగే ఐదుగురికి 20లక్షల 50వేల రూపాయల విలువైన ఎల్‌వోసిలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆపదలో ఉన్నవారికి ఆర్ధిక భరోసా కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నానన్నారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 244 మందికి 3కోట్ల ఒక లక్షా, 41వేల 913 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన్నామన్నారు. సహాయం అందించే క్రమంలో ఎక్కడా ఎటువంటి అలసత్వం లేకుండా వేగవంతంగా, నిబద్దతతో పనిచేస్తున్నామనీ ఆయన చెప్పారు. ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, క్లస్టర్ ఇంచార్జిలు మల్లెపు రాము,ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, పైడి వెంకట్రావు, డివిజన్ ఇంచార్జిలు జాగాని సంతోషి పిలారిశెట్టి సంధ్య ధావాల రంగా తదితరులు పాల్గొన్నారు.

