క్షయవ్యాధి నివారణ విద్యార్థుల బాధ్యత
1 min read

కరీముల్లా టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, డోన్ టీబి యూనిట్.
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల & జూనియర్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన టి.బి.ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్” కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినిలతో మాట్లాడుతూ విద్యార్థినిలు, క్షయ వ్యాధి పట్ల శ్రద్ధ వహించాలన్నారు. టి. బి. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయడం, క్షయ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం, క్షయ వ్యాధి వలన కలిగే మరణాలను తగ్గించడం, భారతదేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించడం లక్ష్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
టి.బి. వ్యాధి లక్షణాలు:-1) దగ్గు 2 వారాలు 2) జ్వరం 3) రాత్రి చెమటలు 4) హెమోప్టిసిస్5) ఛాతీ నొప్పి 6) శ్వాస ఆడకపోవడం7) బరువు తగ్గడం8) ఆకలి లేకపోవడం9) అలసట10) మెడలో వాపు మరియు ఇతర అదనపు ఊపిరితిత్తుల సంకేతాలు/లక్షణాలు. జీవి క్షయ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉన్నవారు :- 1) 60 ఏళ్ళ వయస్సు ఉన్నవారు 2) పోషకాహార లోపం ఉన్నవారు ౩) మధుమేహ వ్యాధిగ్రస్తులు 4) హెచ్ .ఐ.వి వ్యాధిగ్రస్తులు 5) ధూమపానం చేసేవారు 6) మద్యపానం చేసేవారు 7)పాత టి బి రోగులు మరియు టి బి రోగుల కాంటాక్ట్స్ ఈ 7 రకాల సమాజ సమూహాలలో పైన తెలిపిన ఎ ఒక్క లక్షణం ఉన్నా క్షయ పరీక్షలు చేయడం ద్వారా లేదా ఎక్స్-రే తీసుకోవడం వలన టీబీ వ్యాధిని నిర్ధారించడం జరుగుతుందని పేర్కొన్నారు..టి బీ నియంత్రణ లొ , టి.బి. వ్యాధి పట్ల అవగాహన కల్పించడం ద్వారా క్షయ వ్యాధి ఒకరి నుండి ఒకరికి సోకకుండా నిరోధించవచ్చని తెలియజేశారు. ప్రధాన మంత్రి నిక్షయ్ పోషణ్ యోజన పధకం క్రింద నెలకు ప్రతి పేషెంట్ కు 1000 రూపాయలు వారియొక్క వ్యక్తి గత ఖాతాలలో వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మనకు ఉన్న సేవలను ప్రజలందరూ ఉపయోగించు కోవాలని తెలిపారు. టి. బి. వ్యాధి ఉన్నకొంతమందిని మనం దత్తత తీసుకొని వారికీ 6 నెలలు పాటు పోషాకాహారం మానవతా దృక్పధంతో సహాయం చేయాలనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాహుల్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్స్ , కరీముల్లా సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ ఉపేంద్ర , ప్రిన్సిపల్ ప్రియాంక సిబ్బంది ఆరోగ్య శాఖ ఏఎన్ఎం రామా దేవి, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.


