రికార్డు సాధించిన “కె.వీరభద్రి” బద్రి చెస్ అకాడమీ చెస్ కోచ్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు చెస్ చరిత్రలో ఒపెన్ విభాగంలో మూడు అంతర్జాతీయ రేటింగ్స్ సాధించిన “కె.వీరభద్రి” బద్రి చెస్ అకాడమీ చెస్ కోచ్ గా రికార్డు సాధించాడు. ఇంటర్నేషనల్ రేటింగ్స్క్లాసిక్ విభాగంలో ‘1600’ , రాపిడ్ విభాగం లో ‘1606’, బ్లిట్జ్ విభాగంలో ‘1603’ రేటింగ్ సాధించాడు…. విజయవాడలో జరిగిన అంతర్జాతీయ ఎస్ఆర్ఆర్ చెస్ బ్లిట్జ్ టోర్నమెంట్లో 25-08-2025 పాల్గొని ఫైడ్ (ఫైడ్ )రేటింగ్ సాధించడం జరిగింది. సుమారుగా 440 మంది పాల్గొనడం జరిగింది అందులో ఇతర దేశాలు నుండి కూడా రావడం జరిగింది …ప్రపంచ చదరంగ సమాఖ్య (ఫైడ్ ) మరియు అఖిల భారత చదరంగ సమాఖ్య (ఏఐసీఎఫ్) సంయుక్తంగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేసిన చదరంగం జాబితాలో కె. వీరభద్రి (చెస్ కోచ్) ఫైడ్ రెటింగ్ సాధించాడు. అన్ని ఫార్మాట్లో 1600 + రేటింగ్ చెస్ కోచ్ గా కె .వీరభద్రి సాధ్యమైంది.

