ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు ఆర్.ఆర్. పేటలోని గోసంరక్షణ సమితి ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో నేడు ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించబడినది.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్. ఎస్. వాలంటీర్లులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేసారు. గోవులను కడిగి, మేతవేసి. పనికిరాని మొక్కలను తొలగించే సేవా దృక్పధాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు,ఎన్.ఎస్. ఎస్. (ప్రోగ్రాం ఆఫీసర్ కె. హరిబాబు, ఎం.సి.హెచ్ కృష్ణా మరియు గోసంరక్షణ సమితి అధ్యక్షుడు డి.జయప్రకాష్, సెక్రటోరీ ఎమ్.ఎన్.వి.మురళీకృష్ణ మరియు కమిటీ సభ్యులు ఎమ్. సత్యనారాయ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ని మరియు ఎన్.ఎస్.ఎస్. ఆఫీసరని, ఏవో ని సన్మానించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వారు గోసంరక్షణ అవసరం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంపై వివరంగా మాట్లాడారు యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడండి ఎన్.ఎస్-5 వాలంటార్ల పాత్ర ప్రశంసనీయమని, భవిష్యతుంశి ఇలాంటి మరిన్నో సామాజిక కార్యక్రమాలు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.


