NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిఎస్ఎన్ఎల్ ఫ్రీడం ప్లాన్ ఆఫర్ సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  బిఎస్ఎన్ఎల్ గత నెల ఆగస్టు లో స్వాతంత్ర్య దినోత్సవాలలో భాగంగా ప్రవేశపెట్టిన ఫ్రీడమ్ ప్లాన్  గడువు  ను సెప్టెంబర్ 15 వరకు పొడిగించిందని,  కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్  మేనేజర్  శ్రీ జి రమేష్  ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ఫ్రీడమ్ ప్లాన్ లేదా ఆజాది కా ఆఫర్ ద్వారా వినియోగదారులకు ఉచితంగా 4 జి సిమ్ ను  ఇస్తూ కేవలం రూ .1/ – రీచార్జ్ ద్వారా 30 రోజులపాటు ప్రతిరోజు 2 జిబి డేటా,  అపరిమితమైన  వాయిస్ కాల్స్ మరియు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చని ;  ఈ ఆఫర్ కొత్తగా సిమ్ తీసుకునే వారికి మరియు బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యే వారికి వర్తిస్తుందని తెలిపారు.గత నెల ఆగస్టు నెలలో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ఆగస్టు 1నుండి ఆగస్టు 31 వరకు ఉండేదని ,  వినియోగదారుల నుండి వస్తున్న అధిక డిమాండ్ కు  అనుగుణంగా ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించడం జరిగిందని; కావున వినియోగదారులు దగ్గర్లో ఉన్న బిఎస్ఎన్ఎల్  వినియోగదారుల సేవా కేంద్రము లేదా రిటైలర్ను సందర్శించి ఈ ఆఫర్ ను పొందగలరు అని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి రమేష్  తెలియజేశారు.

About Author