NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెటర్నరీ డాక్టర్ను వెంటనే నియమించాలి ..

1 min read

కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎస్ యు ఐ  డిమాండ్

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రికి డాక్టర్ని నియమించాలని  నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సి నాగరాజు, ఎస్ కాజా బాషా,ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మధు మరియు ప్రజా సంఘాల నాయకులు రసూల్,శీను, ఓబయ , హనీఫ్  ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ జలదుర్గ గ్రామంలో ఎంతోమంది రైతులు పశు పెంపకం గొర్ల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్నారని అయితే గత ఆరు నెలలుగా జలదుర్గంలో ఉన్న పశువుల ఆసుపత్రికి డాక్టర్ లేకపోవడం వల్ల ఎన్నో జీవాలు పశువులు మృత్యువాత పడుతున్నాయని అయితే ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసిన వారి నుంచి ఎటువంటి స్పందన లేదని దీనివల్ల ఎంతో విలువచేసే పశువులు గొర్రెలు మరణించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి జలదుర్గ గ్రామానికి వెటర్నరీ డాక్టర్ను నియమించాలని, పశువులకు, గొర్లకు ఇన్సూరెన్స్లను ఏర్పాటు చేయాలని, పశువుల దాన ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరారు..  కలెక్టర్ ఈ విషయమై సానుకూలంగా స్పందించి అతి తొందరలో వెటర్నరీ డాక్టర్ను జలదుర్గం గ్రామానికి నియమిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

About Author