NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనార్దన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే..మాండ్ర

1 min read

మిడుతూరు న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సల్కోటి గోవర్ధన్ రెడ్డి తండ్రి అయిన జనార్దన్ రెడ్డి చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మంగళవారం సాయంత్రం 5:30 కు గ్రామంలోని వారి స్వగృహానికి చేరుకుని జనార్దన్ రెడ్డిని పరామర్శించారు.ఆయన ఆరోగ్య స్థితిగతులను వారు గోవర్ధన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం,ఎస్సై ఓబులేష్,రమేష్,నారాయణ, వెంకటేశ్వర్లు,ఇస్సాక్,డేవిడ్,జీవులు పాల్గొన్నారు.

About Author