బాబు ష్యూరిటీ” పేరుతో మోసం గ్యారంటీ
1 min read

చంద్రబాబు పాలనలొ ముస్లిం మైనారిటీలను మోసగించిన చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ప్రభుత్వం మోసం చేస్తే గడప గడపకూ పోరాటమే – మైనారిటీ ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రజల్లో విశేష చైతన్యం నింపింది.పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, 11వ వార్డు కౌన్సిలర్ & మునిసిపల్ వైస్ చైర్మన్ డి.నజీర్ అహమ్మద్ ,12వ వార్డు ఇంచార్జ్ షాబుద్దిన్ఈ ప్రచారం, వైసీపీ ఎంపీగా సేవలందించిన నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక గ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప అధ్యక్షతన, 11వ వార్డు కౌన్సిలర్ మునిసిపల్ వైస్ చైర్మన్ డి.నజీర్ అహమ్మద్ ,12వ వార్డు ఇంచార్జ్ షాబుద్దిన్ ల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ప్రజల ముందుకు వెళ్లిన నాయకులు, చంద్రబాబు ప్రభుత్వం హామీలపై మౌనాన్ని, అమలులో శూన్యతను వివరించారు. 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన 100కు పైగా హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయని ప్రభుత్వం, నేడు “సుపరిపాలన – తొలి అడుగు” అంటూ మరో మోసం ప్రారంభించిందని తీవ్రంగా మండిపడ్డారు. ఇది తొలి అడుగు కాదు – చంద్రబాబు రాజకీయ జీవితం చివరి అడుగని ప్రజలు అంటున్నారని తెలిపారు.ముస్లిం మైనారిటీల సంక్షేమం విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్, గురుకులాల ఏర్పాటు, హజ్ భవన్‌లు, పావల వడ్డీ రుణాలు వంటి పథకాలు తీసుకొచ్చారని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటిని మరింత విస్తరించి రూ.23 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తూ అభివృద్ధిని కొనసాగించారని పేర్కొన్నారు. పాఠశాల విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫ్రీ కోచింగ్, ఇమామ్ మౌజన్‌లకు నెలనెలా గౌరవ వేతనాలు, మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చేనేత అధ్యక్షులు యంకె శివ, మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులు ఖాసీం బేగ్,పట్టణ మైనారిటీ అధ్యక్షులు రసూల్,పట్టణ ఉపాధ్యక్షులు బి.బజారి రెడ్డి,కోటకొండ నరసింహులు,పట్టణ కార్యవర్గ సభ్యులు అల్తాఫ్,2వ వార్డు ఇంచార్జ్ చంద్ర,18వ వార్డు ఇంచార్జ్ బోయ సోమేశ్,15వ వార్డు ఇంచార్జ్ సయ్యద్ ఫయాజ్,25వ వార్డు ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి,మాజీ కౌన్సిలర్లు మధుబాబు,చేనేత మల్లి, నాయకులు నరేష్,టికే గౌస్, కె.నజీర్,హుస్సేన్,అక్కు భాష,నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు ఎన్.యండి.షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

