NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి:బిషప్

1 min read

బిషప్ కు ఘన సత్కారం..

మిడుతూరు, న్యూస్​ నేడు: (నందికొట్కూరు):నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని గురువారం ఉప్పలదడియ సెయింట్ జాన్స్ పాఠశాల సిస్టర్స్ కాన్వెంట్ లో కర్నూలు మేత్రాసన కాపరి(రోమన్ క్యాథలిక్)బిషప్ శ్రీ గోరంట్ల జ్వాన్నేష్ ను విచారణ గురువులు ఫాదర్ మధుబాబు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ముందుగా బిషప్ మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మూతపడిన పాఠశాలను మళ్లీ ప్రారంభించామని వీటిని విద్యార్థులను పాఠశాలకు పంపిస్తూ విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు తోడ్పాటు అందించాలని బిషప్ అన్నారు.ఎఫ్ఎంఎస్ సీ సభ సిస్టర్లను బిషప్ స్వాగతించారు.కాన్వెంట్ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా బిషప్ పూజను సమర్పించారు.సిస్టర్ సుని చాకో,సుపీరియర్ సిస్టర్ సహాయ రాణి బిషప్ ను శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురువులు జోజి రెడ్డి,భాస్కర్,జాన్ డేవిడ్, బ్రదర్ థోమాస్,సభ సిస్టర్లు మౌళి జార్జ్,మేరీ,ఎలిశమ్మ, శాంతా సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

About Author