NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు నమోదు..

1 min read

మిడుతూరు  , న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారులు పోలీసు ఇన్ స్పెక్టర్ యుగంధర్ బాబు మరియు ఏఏవో షణ్ముఖ గణేష్ మరియు మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ తో కలసి ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు.గురువారం మిడుతూరులో రసాయనిక మరియు పురుగుల మందుల దుకాణదారులు అయిన మన గ్రోమోర్ సెంటర్,కిసాన్ అగ్రిమాల్ మరియు న్యూ బిస్మిల్లా షాపులను ఆకస్మిక తనిఖీలో బట్టబయలు అయ్యయి.న్యూబిస్మిల్లా మరియు కిసాన్ అగ్రిమాల్ దుకాణాదారులు ఎరువులను అధిక ధరలకు అమ్ము తున్నట్లు తేలింది.కావునా షాపు నిర్వాహకులపై 6A కేసులు నమోదు చేసి మరియు మనగ్రోమర్ ఫెర్టిలైజర్ వారు రికార్డ్ మరియు ఈ పాస్ నందు సరిగ్గా నిర్వహించనందునా 28:28:0 ను రైతులకు అమ్మకుండా నిలుపుదల చేసినట్లు వారు తెలిపారు. అనంతరం ఇదే విషయాన్ని స్థానిక పోలీసుస్టేషన్ లో వారిపై ఫిర్యాదు చేశారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

About Author