వృద్ధ దంపతులు అదృశ్యం
1 min read

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కుటుంబ సభ్యులు
చెన్నూరు, న్యూస్ నేడు: మండల కేంద్రమైన చెన్నూరు పడమట వీధి చౌడేశ్వరి దేవాలయం దగ్గరలో నివాసముంటున్న ఆవుల వెంకటసుబ్బయ్య(84) ఆవుల నాంచారమ్మ(76) వృద్ధ దంపతులు బుధవారం ఉదయం 11 గంటల కు ఇంటి నుంచి కట్టు బట్టలతో వెళ్లిపోయారు. సాయంత్రం కుమారుడు ప్రసాద్ ఇంటికి రాగా తల్లిదండ్రులకు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కుటుంబ సభ్యులు కథనం ప్రకారంవివరాలు ఇలా ఉన్నాయి. వృద్ధ దంపతులు వెంకటసుబ్బయ్య నాంచారమ్మ ఇరువురు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బాధపడుతూ పెద్ద కుమారుడు దగ్గరే ఉండేవారని తెలిపారు. కుమారుడు కోడలు పనుల కోసం వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్లిపోయారన్నారు. వృద్ధ మహిళ దగ్గర ఉన్న మెడలో ఉన్న తాళిబొట్టు బంగారం వారి దగ్గర ఉన్న డబ్బులు ఇంట్లోనే పెట్టి వెళ్లిపోవడం జరిగిందని తెలిపారు.చెన్నూరు పోలీసులు గాలింపు చర్యలో భాగంగా రామాలయం వీధిలోని సీసీ కెమెరాలు పరిశీలించగా వృద్ధులు ఆటోలో వెళుతున్నట్లు కనిపించిందని ఈ విషయంపై ఆటో డ్రైవర్ను విచారించగా చెన్నూరు కొత్త రోడ్డు వద్ద వారిద్దరూ ఆటో దిగారని పోలీసులకు వివరించారు. కొత్త రోడ్డుపై నుంచి మైదుకూరు వైపు బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుందని వారి వద్ద ఆధార్ కార్డులు ఉన్నట్టు తెలుస్తుంది. చెన్నూరు సిఐ కృష్ణారెడ్డి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వృద్ధ దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు బంధువులు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

