రైతులకు అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి
1 min read

ఎరువుల దందా చేస్తున్న టిడిపి శ్రేణులు
మా హాయం లో సకాలంలో అందేవి
కూటమి ప్రభుత్వం లో రైతులకు నరకం
ఈ నెల 9 న ఆదోని ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయాలి
వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : రైతుల పట్ల అనుచితంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు క్షమాపణలు చెప్పాలని వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఎమ్మిగనూరు లో భీమ నిలయం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందాల్సిన ఎరువులను టిడిపి శ్రేణులు వారి పొట్ట కొట్టి బ్లాక్ లో అమ్ముకుంటూ దందా చేస్తున్నారని ఆరోపించారు. పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు భోజనాల వద్ద క్యూలో నిలబడడం లేదా అదే విధంగా రైతు సేవా కేంద్రాల వద్ద కూడా ఎరువుల కోసం వరుసగా నిలబడాలని కించ పరిచే విధంగా మాట్లాడిన మంత్రి అచ్చెంనాయుడు రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఎరువులను రైతుల సేవా కేంద్రాల్లో కాకుండా తెలుగు తమ్ముళ్ళ కాంపౌండ్ లో దించుతున్నారని ఆరోపించారు. ఎవరైనా రైతులు మండల వ్యవసాయ అధికారికి ఫోన్ చేస్తే తూతూ మంత్రంగా కేవలం రెండు బస్తాల చొప్పున రైతులకు అందజేస్తున్నారని విమర్శించారు. సరైన సమయంలో ఎరువులు అందక, ఇన్సూరెన్స్ సదుపాయం లేక, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. గత వైసిపి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ప్రతి ఒక్కరికీ లభించేవని, రైతులకు పంటల భీమా కు డబ్బులు ప్రభుత్వమే చెల్లించి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేదని తెలిపారు. గిట్టుబాటు ధర కూడా కల్పించి రైతుల సంక్షేమం కోసం కృషి చేసిందని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణం నిధుల ద్వారా ఉల్లికే కాక ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించిదని నేరుగా జగనన్న ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసిందని తెలిపారు. ఎరువుల కొరత పై మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించే వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం చంద్రబాబు నాయుడికే దక్కిందని విమర్శించారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఒక ఏడాది అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎగ్గొట్టి రెండో ఏడాదిలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన పథకం రెండు కలిపి రైతుల ఖాతాల్లో చేసి సంబరాలు జరుపుకున్నారన్నారు. మీ ప్రభుత్వం లో రైతులు రైతులెవరూ సంతోషంగా లేరని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచి పంటల గిట్టుబాటు ధర పై స్పష్టత ఇవ్వాలని భీమా కల్పించాలని కోరుతూ ఈ నెల 9 వ తేదీన సబ్ డివిజన్ కార్యాలయం వద్ద రైతులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పీఎ వెంకట్రామిరెడ్డి, మహీంద్రా రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధి గురురాజరావు, వైసిపి రైతు విభాగం జిల్లా అధ్యక్షులు రవి చంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, నాలుగు మండలాల అధ్యక్షులు జి భీమారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ప్రహ్లాద జ్యోషి, గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

