వట్లూరు గురుకుల పాఠశాలకు ఎక్స్ లెన్స్ అవార్డు కైవసం
1 min read

ప్రిన్సిపల్ ని సత్కరించిన జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
అభినందించిన అధ్యాపకులు, సిబ్బంది
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గురుపుజోత్సవం సందర్భంగా వట్లూరు గురుకుల పాఠశాలకు క్రీడలు మరియు ఆటల విభాగంలో విద్యార్థులు ఎంతో ప్రతిభను కనబరిచి ‘ఎక్సలెన్స్ అవార్డు’ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ పి.ధాత్రి రెడ్డి మాట్లాడుతూ వట్లూరు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు క్రీడల్లో రాణించి వారి నైపుణ్యంతో అవార్డు అందుకోవటం అభినందనీయమన్నారు. కార్యదీక్ష, కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించుకోవచ్చునన్న దానికి ఇదే నిదర్శనం మన్నారు. ఎంతో క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్ది, వారి విజయాలకు బాటలు వేసిన ప్రిన్సిపల్ ని జేసీ ధాత్రిరెడ్డి అభినందించారు. ఈ అవార్డు లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ పి.మేరీ ఝాన్సీ రాణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డును స్వీకరించడం మాకు గర్వకారణం. ఈ విజయానికి కృషి చేసిన మా విద్యార్థులకు, పిడి. పిఈటి కి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(APSWRS) తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


