ప్రేమాలయం వృద్ధులకు పండ్లు పంపిణీ
1 min read

సామాజిక సేవ ద్వారా విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం అలవర్చుకుంటారు
కళాశాల ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు సమీపంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో సత్రంపాడు ఆదిత్య కాలేజీ ఆధ్వర్యంలో ప్రేమాలయంలో ఉండే వృద్ధులకు పండ్లు, ఫలహారాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వంగ వెంకటేశ్వరరావు, యన్.ఎస్.ఎస్ ఆఫీసర్ బాబు, ఏవో సి.హెచ్ కృష్ణ, వాలంటర్లు విద్యార్థిని విద్యార్థులు వృద్ధులతో మమేకమై ఉత్సాహంగా పాల్గొన్నారు. మన బాధ్యతలలో భాగంగా వృద్ధులతో మమకారంతో మెలగడం వారి అవసరాలను గుర్తించి సహాయం చెయ్యడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. వృద్ధులకు పండ్లు అందజేస్తూ విద్యార్థులు వారి ప్రేమను చాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సమాజక సేవ ద్వారా విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం అలవర్చుకుంటారని, వృద్ధులు పట్ల ప్రేమ, ఆదరాభిమానాలు పెంచుకోవడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. యన్.ఎస్.ఎస్ ఆఫీసర్ మరియు వాలంటీర్ లు తమ అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


