వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి..
1 min read

ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించిన ఘనత మాదే..
క్వింటా ఉల్లి రూ.1200 కొనుగోలు చేస్తున్నాం..
మద్యం తాగించి.. పురుగు మందు తాగారంటూ దుష్ప్రచారం చేస్తారా..
ప్రభుత్వంపై బురద జల్లడే వైసీపీ నేతల పని..
టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు : వైసీపీ దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలకకపోతే… 2029 లోనూ ఘోర పరాజయం తప్పదని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఉద్ఘాటించారు. చిల్లర రాజకీయాలు చేసినందుకే 2024లో 11 సీట్లకే పరిమితమయ్యారని, ప్రజలు ఛీ కొట్టినా వైసీపీ నేతలకు సిగ్గు రాలేదన్నారు. సోమవారం కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు బోగ్గుల దస్తగిరి, టీటీడీ బోర్డు మెంబరు మల్లెలల రాజశేఖర్ గౌడ్ మాట్లాడారు. ఉల్లి రైతులకు గిట్టు బాటు ధర కల్పించి.. వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే… సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడ వైసీపీ నేతలకే చెల్లిందన్నారు. గత శుక్రవారం కోడుమూరు నియోజకవర్గం సి. బెల్లగల్ మండలం, పోల్కల్ గ్రామంలో వై.సి.పి.కి చెందిన గుండ్లకొండ క్రిష్ణ, గుండ్లకొండ వెంకటనాయుడు మహాలయపౌర్ణమిని పురష్కరించుకొని మద్యం సేవించగా గ్రామంలోని వై.సి.పి. నాయకుడు వారిచేత ఖాళీగా ఉన్న క్రిమిసంహారక మందు డబ్బాలో మద్యం పోయించి వారిచేత త్రాగించి ఉల్లిపంటకు గిట్టుబాటు ధరలేనందున ఆత్మహత్యచేసుకుంటున్నట్లు వారిచేతనే సెల్ఫీ విడియో తీయించి, 108కు ఫోన్ చేయించి, సోషల్ మీడియాలో ప్రచారం చేయించారని, తీరా వారిని ఆసుపత్రిలో చేర్పించగా వైద్యలు వారు క్రిమిసంహారక మందు సేవించలేదనీ, కేవలం మద్యం మాత్రమే సేవించారనీ దృవికరించారన్నారు. ఈ విషయాలను తెలుసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొని రావాలన్న కుట్రతో జిల్లా వై.సి.పి. నాయకులు వారిని రెచ్చగొడుతూ మాట్లాడారని, రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతుల సాధక బాధకాలు తెలుసుకొన్నందువల్లనే వారికి గిట్టుబాటు ధరను నిర్ణయించి రైతులనుండి ఉల్లిని కొనగోలు చేస్తున్న విషయాన్ని గ్రహించలేని వై.సి.పి. నాయకులు ఉల్లిరైతులను అడ్డుపెట్టుకొని అమాయకులైన వారి ప్రాణాలను బలిగొనేందుకు సిద్ధపడ్డారనీ, వై.సి.పి. వారు చేసే శవరాజకీయాలకు చివరికి రైతులను పావులుగా వాడుకోవాలని చూశారని ధ్వజమెత్తారు. సమావేశంలో పార్టీ నాయకులు బోయ సంజీవలక్ష్మి, బేత క్రిష్ణుడు, పి.హనుమంతరావు చౌదరి, పెరపోగు రాజు, షేక్షావల్లి తదితరులు ఉన్నారు.

