NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర అభివృద్ధి ప్రజాసంక్షేమం… కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం..

1 min read

టిడిపి నాయకులు

హొళగుంద న్యూస్ నేడు : ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తో పాటు ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, కూటమిపాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్, ఆలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి, టిడిపి నాయకులు జాకీర్, అబ్దుల్ సుభాన్, డి ఎస్ బాషా, సి బి ఎన్ ఆర్మీ మోయిన్,ఈరప్ప లు అన్నారు. సోమవారం కొత్తగా వేసిన చిన్నహేట రోడ్డు ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి రాష్ట్రంలోనే మారుమూల పశ్చిమ మండలమైన హోళగుంద మండలంలో రోడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు.రూ.4.75  కోట్ల రూపాయలతో మండల పరిధిలోని హోన్నూర్ క్యాంప్ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చిన్నహ్యట రోడ్డు నిర్మాణానికి  రూ.3.60 కోట్ల రూపాయలు కేటాయించి శరవేగంగా రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా మండల వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల రూపాయలతో గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఎన్నో రోజులుగా మండలానికి అతిపెద్ద సమస్యగా మారిన హోళగుంద – ధణపురం రోడ్డు నిర్మాణానికి 14 కోట్ల రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు పంపారని, త్వరలోనే ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని అన్నారు. అభివృద్ధితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, దీపం పథకం, పెన్షన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు.కొంతమంది వైసీపీ నాయకులు, పొలిటికల్ టూరిస్టులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. కూటమిపాలనలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ప్రజలు గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author