NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉల్లికి మద్దతు ధర కల్పించాల్సిందే..

1 min read

కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి

కర్నూలు, న్యూస్ నేడు : ఉల్లి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు మార్కెట్ యార్డు కు ఉల్లి గడ్డలను తీసుకొచ్చిన రైతులను  సోమవారం ఆమె పరామర్శించారు.  ఈ సందర్భంగా షర్మిలా రెడ్డి మాట్లాడుతూ ఉల్లి రైతులు పండించిన ధరకు అమ్ముతున్న ధరకు పొంతనలేదని ఉల్లి రైతులు కన్నీరు పెట్టుకునే స్థితిలో ఉన్నారని వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఉల్లి పండించడానికి ఎకరానికి ఎనబై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి పెడితే… క్వింటా రూ.600 కూడా రావడంలేదని, గత ప్రభుత్వం 4 వేల నుంచి 5వేలు అమ్ముడు పోయిందని గుర్తు చేశారు.  పండించిన పంటకు అయిన ఖర్చులో సగం కూడా రావడంలేదని రెండు రోజుల క్రితం ఇద్దరు రైతులు  ఆత్మహత్యా యత్నం  చేసుకుంటే… వారిని వైసీపీ కార్యకర్తలు అంటూ ముద్ర వేసి కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.  ఉల్లి రైతులకు భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఉల్లికి కనీస మద్దతు ధర 2400 రూపాయలు కల్పించాలని , . రైతుల ఖాతాలో క్వింటాలుకు 1200 రైతుల ఖాతాలలో జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిలా రెడ్డి తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో నంద్యాల డిసిసి అధ్యక్షు లు కర్నూల్ కాంగ్రెస్ ఇంచార్జి ఎఐసిసి సభ్యులు జే లక్ష్మీ నరసింహ యాదవ్, మాజీ మంత్రి మూలింటి మారెప్ప మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు  కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, ఉమ్మడి కర్నూలు జిల్లా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఎం ఖాసిం వలి, బి క్రాంతి నాయుడు, మురళీకృష్ణ రాజు అనంతరత్నం మాదిగ రమేష్ యాదవ్ చాకలి పుల్లయ్య గార్లపాటి మద్దిలేటి తేనే నాగరాజు బాలు యాదవ్, రాష్ట్ర పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శులు దామోదరం రాధాకృష్ణ చింతల మోహన్ రావు యాదవ్, ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి పాషా, కర్నూల్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కే రాఘవేందర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శులు రజాక్ వలి, పగిడాల అమన్  తదితరులు  పాల్గొన్నారు.

About Author