NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వని చేతగాని ప్రభుత్వం దిగిపోవాలి

1 min read

పత్తికొండ వైఎస్ఆర్సిపి     

పత్తికొండ, న్యూస్​ నేడు:  రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం చేతకాని సీఎం డౌన్ డౌన్ అంటూ, పత్తికొండ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టింది. వైయస్సార్సీపి పిలుపుమేరకు అన్నదాత పోరులో పాల్పంచుకునేందుకు రైతులు ఉప్పెనలా వచ్చారు.పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ,ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో రైతులు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పట్టణంలో ర్యాలీ చేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్డీవో కార్యాలయం వద్దకు రైతులు, నేతలు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.గిట్టుబాటు ధర లేక అప్పులు తీర్చే దారి కనిపించక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే వారిపైనే కేసులు పెట్టడం రాక్షసత్వం కాదా అని ప్రశ్నించారు. గత జగనన్న పాలనలో ఎప్పుడైనా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రైతు సమస్యలు పరిష్కరించలేక పోతే వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే విరుపాక్షి డిమాండ్ చేశారు.రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులకు విన్నవించుకునేందుకు వస్తే పోలీసులు డ్రోన్లు ఉపయోగించి కేసులు పెడతామని భయపెడుతున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు ఆరోపించారు.ఎవరెన్ని ఆంక్షలు విధించినా కేసులు పెట్టినా రైతుల పక్షాల నిలబడి పోరాడేందుకు జగనన్న ఆధ్వర్యంలో మేము సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. రైతు వ్యతిరేక కూటమి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

About Author