జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో కాంస్య పతకం సాధించిన రిడ్జ్ విద్యార్థి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక లక్ష్మీపురం సమీపం లోని రిడ్జ్ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న తోటిరెడ్డి కీర్తి సిబిఎస్సి జాతీయ స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీలలో అసామాన్య ప్రతిభ కనబరిచారు. సెప్టెంబరు 3 నుండి 7 వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్నీవ్ విజన్ పాఠశాల లో నిర్వహించిన ఈ పోటీలలో తలపడి రిడ్జ్ పాఠశాల విద్యార్థి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. జిల్లాస్థాయి నుండి రాష్ట్రస్థాయికి, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి పోటీల వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. తైక్వాండో అనేది ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరు తైక్వాండో నేర్చుకోవాలని పథకం సాధించిన విద్యార్థిని కీర్తి పేర్కొన్నారు. జాతీయస్థాయిలో తమ పాఠశాల విద్యార్థి కాంస్య పథకం సాధించినందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని పాఠశాల సి.ఈ.ఓ గోపీనాథ్ అభినందనలు తెలియ చేసారు. ఈ ఘన విజయానికి ప్రధాన కారకులైన తైక్వాండో మాస్టర్ సుందర్ రాజ్ కు పాఠశాల యాజమాన్యం వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ అభినందన సభలో పాఠశాల కో – సి.ఈ.ఓ. సౌమ్యా గోపినాథ్ , డీన్ రాజేంద్రన్ , ప్రిన్సిపల్ రాజ్ కమల్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

