NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:   పత్తికొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పత్తికొండ నియోజకవర్గంలోని  21 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 13 లక్షల 62 వేల రూపాయలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులనుపత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ కష్టకాలంలో కుటుంబానికి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని అన్నారు,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే శ్రీ.కే.ఈ. శ్యామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author