నేడు గ్రోమోర్ సెంటర్ ద్వారా యూరియా పంపిణీ
1 min read

మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి
చెన్నూరు, న్యూస్ నేడు: చెన్నూరు గ్రోమోర్ సెంటర్ ద్వారా శుక్రవారం 9.9 టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె గురువారం చెన్నూరు విలేకరులతో మాట్లాడుతూ, గ్రోమోర్ సెంటర్ ద్వారా రైతులకు 9.9 టన్నుల యూరియాను పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా మండలంలోని కొండపేట రైతు సేవా కేంద్రం లో 19.8 టన్నుల రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందని రైతులు ఎకరాకు 100 కేజీల యూరియాను మూడు దఫాలుగా సరిపోతుందని, అంతకంటే ఎక్కువ వాడడం ద్వారా చీడపీడలు ఎక్కువై సాగు ఖర్చులు కూడా పెరగడం జరుగుతుందని ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలని ఆమె కోరారు. యూరియా తీసుకోవలసిన రైతులు తమ పాసుబుక్కులను ఆధార్ కార్డులను తప్పనిసరిగా గ్రోమోర్ సెంటర్ కు తీసుకెళ్లి యూరియాను తీసుకోవలసినదిగా ఆమె కోరారు.


