NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రీవెన్స్ డే లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు

1 min read

ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు దేవప్ప మాదిగ  ఆధ్వర్యంలో అర్జీలు  ఇవ్వడం జరిగినది

హొళగుంద న్యూస్ నేడు  :  హొళగుంద మండలంలోని ఎస్సీలకు స్మశాన వాటికలు, సివిల్ రైట్స్ డే, ఎస్సీ హాస్టల్, మరియు రోడ్లు గురించి అర్జీలు ఇవ్వడం జరిగినది.1.హొళగుంద మండలంలోని వన్నూర్ క్యాంప్, వందవాగిలి, గజ్జహళ్లి, సమ్మతగేరి ఇలా చాలా గ్రామాలలో SC లకు నేటికీ స్మశాన వాటికలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 2) మన మండలంలోని SC హాస్టల్ గత 8 సంవత్సరాలుగా మూత పడినది దీని వల్ల మండలంలోని  విద్యార్థులు హాస్టల్ వసతులు లేక విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు.3) ప్రతి నెల 30న జరిగే సివిల్ రైట్స్ డే ను నిర్వహించి పౌర  హక్కులకు భంగం కలగకుండా జాతీ మత లింగా భేదాల లేకుండా   ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు .4) మన మండలంలోని ఆదోని నుండి హొళగుందకు వచ్చు రోడ్డు గుంతల మైయ్మై చాలా అధ్వనంగా తయారైంది గత 2 ఏళ్ళ క్రితం ఈ రోడ్డులో బస్సులు నడపలేక నిలిపి వెయ్యడం జరిగింది. కావునా జిల్లా అధికారి అయినా తమరు పైన పేర్కొన్న సమస్యల పైన దృష్టి సారించి సమస్యలు పరిష్కరించి మండల ప్రజలు చాలా రోజుల కోరికలను పరిష్కరించాలని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్  నాయకులు దుర్గప్రసాద్, నాగరకన్వి వెంకటేష్, పల్లి ఈరన్న, కల్లప్ప, గోవిందు, శేషగిరి, వెంకటేష్,ఎమ్మార్పీఎస్ యువ నాయకులు హనుమంతు, వీరేష్, మల్లి, రాజు, నగేష్, పరశురాం, మృత్యుంజయ, సాయిబేస్, తదితరులు పాల్గొన్నారు.

About Author