వివేకానంద చికాగోలో తొలి ప్రసంగానికి నేటికీ 132 సంవత్సరాలు
1 min read

ఆదిత్య డిగ్రీ కళాశాల వేదికగా కార్యక్రమం
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తొలి వ్యక్తి స్వామి వివేకానంద
ప్రిన్సిపాల్ వంగా.వెంకటేశ్వరరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : విశ్వబంధు దినోత్సవం సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల వేదికగా వివేకానంద కేంద్ర- కన్యాకుమారి వారు స్వామి వివేకానంద చికాగో తొలి ప్రసంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వివేకానందుడు చికాగోలో ఇచ్చిన మొదటి ప్రసంగం నేటికీ ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుందని, భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిహెచ్. సదాశివరావు (వివేకానంద కేంద్ర ఐక్యం ఆంధ్ర. ఒరిస్సా తీరప్రాంతం) మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి దాత వివేకానందుడని, ఒక వ్యక్తి ప్రసంగానికి జయంతి వేడుకలు జరపడం భారతదేశ గొప్పతనమన్నరు, వివేకానందుడు జాతి కిచ్చిన సందేశం,యువత కర్తవ్యాలు గురించి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డి.వి.వి ఫణికుమార్ మాట్లాడుతూ వివేకానందుడి తొలి ప్రసంగానికి నేటికీ 132 సంవత్సరాలు పూర్తయ్యాయని యువత తమలో దాగిన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ కె. హరిబాబు,కల్చరల్ ఆఫీసర్ పి.సౌభాగ్య లక్ష్మి, ఆధ్యాత్మిక, అధ్యాపకేతర సిబ్బంది. వివేకానంద కేంద్ర ప్రముఖులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.


