NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం దారుణం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కురువ కులస్తుల ఆరాధ్య దైవం కురువ జాతికి వన్నెతెచ్చిన దాసశ్రేష్ఠ శ్రీ భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడం దారుణమని అత్యంత దుర్మార్గమని గడివేముల మండల కురవ కమిటీ సంఘం తీవ్రంగా ఖండించారు. పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామం లోని కురువ సంఘం కమిటీ కార్యాలయంలో శుక్రవారం నాడు గడివేముల మండల కురవ కమిటీ సంఘం వారు రెండు రోజుల క్రితం జరిగిన శ్రీ భక్త కనకదాసు విగ్రహ ధ్వంసానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో కురువల ఆరాధ్య దైవం కురువ కులస్తుల జాతి కి వన్నెతెచ్చిన శ్రీ భక్త కనకదాసు విగ్రహం చెయ్యి విరగగొట్టి ధ్వంసం చేయడం చాలా దారుణం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఆ గ్రామంలో ఒకరిపై ఒకరికి ఏమైనా వ్యక్తిగత ద్వేషాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండే మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేయడం చాలా సిగ్గుచేటని తీవ్రంగా ఖండించారు. శ్రీ భక్త కనకదాసు విగ్రహం ధ్వంసానికి కారకులైన వారిని గుర్తించి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల కురువ సంఘం అధ్యక్షుడు రామస్వామి(ఎంపీటీసీ), ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం డైరెక్టర్ యుగంధర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కే పాపారాయుడు, కురువ సంఘం నాయకులు మొగిలి శ్రీనివాసులు, పెసర వాయి విశ్వం, బూజనూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, లింగన్న, పకీరయ్య, బిలకల గూడూరు గ్రామం కొత్త వెంకటేశ్వర్లు, పోతురాజు వెంకటస్వామి, పెద్ద వెంకటరాముడు, మండలంలోని ఆయా గ్రామాల కురువ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author