NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“ఫ్రీ బస్సు పథకం” తో నష్టపొతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

1 min read

-ఏఐటియూసీ

పత్తికొండ, న్యూస్ నేడు:  మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ, ఆటో వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధం తాలూకా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆటో కార్మికులు స్థానిక చదువుల రామయ్యా భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి,   ఆర్డిఒ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షుడు జి. నెట్టేకంటయ్య అధ్యక్షత వహించగా,ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి ఎం.రంగన్నలు‌ సిపిఐ మండల కార్యదర్శి యువ్.కారుమంచి వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం కారన్న లు పాల్గొని వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 894 గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి నూతన చట్టాలు జీవో నెంబర్ 21&31పేరుతో భారీ జరిమానాలు విధిస్తూ ఆటో కార్మికులను వేధిస్తున్నారన్నారు.తక్షణమే అధికారులు ఆటోలపై చేస్తున్న దాడులను ఆపి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో రంగాన్ని కాపాడాలని కోరారు.ఆటో డ్రైవర్స్ & మోటారు కార్మికులకు షరతులు లేకుండా  ప్రభుత్వం వాహన మిత్ర ఇవ్వాలి. జి.ఓ.నెం.21&31 రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కంటే ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు కోరారు.ధర్నాఅనంతరం ఆర్డీవో భరత్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ తాలూకా డిప్యూటీ కార్యదర్శి జి.గుండు బాషా‌, ఆటో యూనియన్ తాలూకా కార్యదర్శి ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షుడు రాజప్ప, సిపిఐ మండల సహయ కార్యదర్శులు గిడ్డయ్యగౌడ్, కాశీ రైతు సంఘం సిద్ధు ఏఐవైఫ్ ఉపేంద్ర పెద్ద హుల్తి ఆటో కార్మికులు రవి ,ఉచ్చన్న పత్తికొండ టౌన్ ఆటో కార్మికులు  మొలగవల్లి రమేష్, రాజు, మాలిక్ భాష, హరి, దూదేకొండ ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

About Author