NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్లాస్టిక్ రహిత సమాజం అందరి బాధ్యత

1 min read

జనసేన పార్టీ నాయకులు మేడిచర్ల కృష్ణ

ఇళ్లలో పాడైన ప్లాస్టిక్ వస్తువులు తెచ్చిన వారికి బహుమతులు ప్రధానం

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : పెదవేగి మండలంలోని విజయరాయి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మేడిచర్ల కృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రామస్తుల సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం,స్వదేశీ వస్తువుల నిర్మూలన,స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే ఇళ్లల్లో ఉన్న పాత ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ బరువును బట్టి మంచి బహుమతి ఇవ్వడం జరుగుతుందని, ప్లాస్టిక్ రైతు సమాజం అందరి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమాలను  ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కె.సురేష్, జె.రామ్ చరణ్ తేజ, ఏ.దుర్గాప్రసాద్, డి.వినోద్ తదితరులు పాల్గొన్నారు.

About Author