రాష్ట్రీయ మోది సేవాసమితి యొక్క పదాధికారుల నియామకం
1 min read

ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్ ఎం ఎస్ ఎస్ జాతీయ అధ్యక్షులు వికాస్ యదువన్షి.
విజయవాడ, న్యూస్ నేడు : ఒక ప్రముఖ హోటల్లో రాష్ట్రీయ మోది సేవా సమితి యొక్క పదాధికారులను రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండలాల వారీగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ ఎం ఎస్ ఎస్ జాతీయ అధ్యక్షులు వికాస్ యదువన్షి హాజరు అయ్యారు. వారి చేతుల మీదుగా మొదట ఆర్ ఎం ఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా అన్నం అజయ్ నియామక పత్రాన్ని తీసుకోవడం జరిగింది. అనంతరం జిల్లాల పదాధికారులు వికాస్ యదువన్షి చేతుల మీదగా నియామక పత్రాలు తీసుకున్నారు. అనంతరం మండలాలకు ఎంపికైన పదాధికారులు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోది 75వ పుట్టినరోజు సందర్భంగా 75 మంది పేదలకు నిత్యావసర సరుకుల కిట్లను చిరు కానుకగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికాస్ యదువన్షి మాట్లాడుతూ రాష్ట్రీయ మోదీ సేవా సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరేలాగా చూడడం, బాల బాలికల అందరికీ విద్య ను అందించే విధంగా చూడడం, అదేవిధంగా పేదింటి ఆడపిల్లలకు వివాహానికి అయ్యే ఖర్చు లు అందించడం, అదేవిధంగా ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య వైద్య సేవలను అందించడం, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలు స్వయం సమృద్ధిగా జీవించడానికి ఉపాధి అవకాశాలను కల్పించడం, అదేవిధంగా గోవధను పూర్తిగా నిషేధించి ప్రతి మండలంలో ఒక గోశాల ను ఏర్పాటు చేయడం రాష్ట్రీయ మోదీ సేవా సమితి యొక్క ప్రధాన ఉద్దేశం మరియు లక్ష్యం అని తెలియజేశారు. అనంతరం ఆర్ ఎం ఎస్ ఎస్ ఏపీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అన్నం విజయ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి దక్కడం ఆనంద దాయకమని తనకు ఈ పదవి రావడానికి సహకరించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని తెలియజేశారు. అదేవిధంగా బాలబాలికలకు, పేదింటి ఆడపడుచులకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ మండలంలోని జిల్లాలోని పదాధికారులను కలిసి తమ సమస్యలకు తగిన పరిష్కారం రాష్ట్రీయ మోది సేవా సమితి ద్వారా పొందవచ్చును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ప్రధాన కార్యదర్శి బాలాజీ సూర్యవంశీ, ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇంచార్జ్ రాహుల్ బోస్లే, ఏపీ ప్రెసిడెంట్ అన్నం విజయ్, కార్యదర్శి దినేష్ కుమార్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్కోజి సుబ్రహ్మణ్యం, జిల్లా, మండల పదాధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

