NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

1 min read

200 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ఇరువురి పై కేసు నమోదు చట్టరీత్యా చర్యలు

సిఐ పి.అశోక్ కుమార్

ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు  : సోమవారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్,ఏలూరు బి.శ్రీలత , అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ , ఎన్ఫోర్స్మెంట్ , ఏలూరు కె.వి.ఎన్.ప్రభు కుమార్, మరియు డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్, ఏలూరు జిల్లా, ఏలూరు ఏ.ఆవులయ్య వారి ఆదేశాలు ప్రకారము చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో,  ఎక్సైజ్  స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది కలిసి కృష్ణాపురం గ్రామములో ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా భూక్యా సర్వేశ్వర రావు మరియు భూక్యా రాజు కు సంబంధించిన (200) లీటర్లు  పులిసిన  బెల్లపు ఊట ను ధ్వంసం చేసి వారిద్దరిని అదుపులో తీసుకొని, వారిరువురు పై  కేసు నమోదు చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని  ఒక ప్రకటనలో తెలిపారు.ఈ దాడులలో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ.లు అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు మరియు సిబ్బంది  పాల్గొన్నారని సి.ఐ.పి.అశోక్ తెలిపినారు.

About Author