NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీతాలను ప్రతినెల 1వ తారీఖున చెల్లించాలి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం నందు ఒప్పంద మరియు పొరుగు సేవల సిబ్బంది జీతాలను ప్రతినెల 1వ తారీఖున చెల్లించాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒప్పంద మరియు పరుగు సేవల సిబ్బంది అందరిని అందరినీ వారి అర్హతను బట్టి క్రమబద్దీకరించి వారి జీవితాలలో వెలుగులు నింపుతామని హామీలు ఇచ్చి, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకోకపోగా కనీసం 16 వ తారీకు దాటిన జీతాలు లేక కష్టాలపాలు అవుతున్నారు. కావున ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మా యొక్క వేదన ను పట్టించుకోని మాపట్ల మీరు చేసినటువంటి వాగ్దానాలను అన్నింటిని నెరవేర్చాలని కోరుతూ మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం నందు విధులు నిర్వహిస్తున్నటువంటి మండల జేఏసీ నాయకులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం లక్ష్మప్ప, పి. సాయిబేష్, బి తుకారం, కే పంపాపతి, ఈ రేణుక, కే రవీంద్రనాథ్, ఎన్ వెంకటేశ్వర్లు మరియు శ్రీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author