రచ్చమర్రిలో రాష్ట్రీయ పోషణ మాసం
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని రచ్చమర్రి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమిత్రా అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిల్లీలో ప్రారంభించడం జరిగిందన్నారు. బాల్య దశలో పోషణ , సంరక్షణ , విద్య ,స్థూలకాయం వంటి అంశాలపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఏన్ఏం శాంతి కుమారి , యం ఎల్ హెచ్ శారదా , వినోద్ , అంగన్వాడీ వర్కర్లు అంజినమ్మ , మీనాక్షి , భారతి ,నాగవేణి , లావణ్య , ఆశావర్కర్లు రాజలక్ష్మి , శివలింగమ్మ , శారదా తదితరులు ఉన్నారు.

