రాఘవేంద్రుని సన్నిధి లో సంగీత దర్శకులు యం.యం. కీరవాణి, కళ్యాణ్ మాలిక్
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు , గాయకులు యం.యం కీరవాణి, కళ్యాణ్ మాలిక్ కుటుంబ సభ్యులు రచయిత విజయేంద్ర ప్రసాద్ ,కళ్యాణ్ మాలిక్ నటులు కాంచి లు గురువారం సాయంత్రం మంత్రాలయం కు వచ్చారు. వీరికి మంత్రాలయం సిఐ రామాంజులు స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని , పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. వీరికి పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు శేషవస్ర్తం కప్పి , ఫల మంత్రాక్షితలు , రాఘవేంద్రస్వామి మెమోంటో ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట రఘువీరా , మోహన్ , శ్రీ చైతన్య , శివ కంరణ ప్రియ, సప్తమి , చౌదరి , వెంకటేష్ , మయూరి , మంగళగౌరి, విజయరఘువన్ , హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు , కానిస్టేబుల్ రంగస్వామి , తదితరులు ఉన్నారు.

