NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా

1 min read

రాత్రి వేళ గస్తీ పటిష్టం…

కర్నూలు, న్యూస్​ నేడు:  విజిబుల్ పోలీసింగ్  చేయాలని జిల్లా పోలీసులకు కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశించారు.జిల్లా ఎస్పీ  ఆదేశాలతో  విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా రాత్రి వేళల్లో ప్రజల భద్రత ,  రక్షణలో  అన్ని ముఖ్య కూడళ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలు , రహదారులపై సంచరిస్తూ పోలీసు పెట్రోలింగ్ చేస్తూ గస్తీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి నేరాలు జరగకుండా ఎటిఎం కేంద్రాల వద్ద రాత్రి గస్తీని పటిష్ట చేశారు. పాత నేరస్థులు, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్లు ఉంటే అరెస్టు చేసేలా మొబైల్ సెక్యూరిటి డివైజ్‌లతో వేలిముద్రలను సేకరిస్తున్నారు.  పాత నేరస్థుల జాబితాతో  పోల్చి చూస్తున్నారు. వారిని విచారిస్తున్నారు. ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగులకు దూరంగా ఉండాలన్నారు. నేరాల కట్టడిపై నిఘా, రోడ్డు సేఫ్టీ నియమాలపై ప్రజల్లో అవగాహన, తదితర చర్యలు చేపట్టారు.

About Author