ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం
1 min read

పిల్లల ఆధారు సీడింగు, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియ వేగవంతం చేసి లక్ష్యాలను అధిగమించాలి
0-5 ఏళ్ళు లోపు పిల్లలకు నూటికినూరు శాతం ఆధారు నమోదు చెయ్యాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం ఆధారు మానిటరింగు కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లాలో మండలాలు వారీగా ఆధారు మానిటరింగు ప్రగతిని సమీక్షిస్తూ లక్ష్యాలు సాధించిన మండలాలు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. లోటు కనిపించిన మండలాలపై జిల్లా కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 192 ఆధారు సెంటర్లు ఉన్నాయని, అన్ని మండలాల్లో ఆధారు సెంటర్లు, ఆధారు కిట్లు సమర్థవంతంగా పనిచేసేలా చూసి లక్ష్యాలను అధిగమించాలన్నారు.0-5 వరకు తప్పని సరిగా ఆధారు నమోదు చేయించాలని, 5-7 వయస్సు వారికి చేతి వ్రేలిముద్రలు తీసుకోవాలని, 15- 17 వయస్సు వారికి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని అన్నారు. తల్లికి వందనం,తదితర పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాఫ్ ద్వారా పౌరులకు అందేసేవలుపై విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దివ్యాంగులకు,వృద్ధులకు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి బయోమెట్రిక్ అప్డేట్ చేయించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆధారు రీజనల్ మేనేజరు ఏ.సత్యకళ, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికారి డా:పి.జె.అమృతం,డిసి హెచ్ఎస్ డా:బి.పాల్ సతీష్ కుమార్,ఐసిడియస్ పిడి ఏ.శారద,యల్ డియం డి.నీలాద్రి, డియల్డివో ఏ.లక్ష్మీ, సంబంధిత అధికారులు,ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


