ఉద్యోగులకు ప్రభుత్వం ఐఆర్ 30 శాతం ప్రకటించాలి
1 min read

త్వరలోనే ఏలూరు తాలూకా యూనిట్ ఎన్నికల నిర్వహిస్తాం
ఏపీ ఎన్జీవో సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్
ఉద్యోగుల సంక్షేమం కోసం 70 సంవత్సరాల నుంచి సేవలందిస్తున్నాం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జడ్పీ ఆవరణలో ఉన్న పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ భవనం లో ఏలూరు తాలూకా ఏపీ ఎన్జీజివో సంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు గొన్నూరి శ్రీధర్ రాజు,కార్యదర్శి కప్పల సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఎన్జీజివో సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం 70 సంవత్సరాలు నుంచి సేవల్ని అందిస్తున్న సంఘం గా ఏపీ ఎన్జీవో సంఘాన్ని అభివర్ణిస్తూ అనేక ఉద్యమాలతో ఉద్యోగుల పక్షాన పోరాడుతూ ఉన్న సంఘాన్ని మరింత ఇనుమడింప జేయాలని,సభ్యత్వం నమోదు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. త్వరలోనే ఏలూరు తాలుకా యూనిట్ ఎన్నికలని నిర్వహిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులకి గత ప్రభుత్వం మొదలుకొని నేటి వరకు సరెండర్ లీవు నగదు మూడు ఆర్థిక సంవత్సరాల బకాయి,నాల్గు కరువు భత్యాలు 12 వ పే రివిజన్ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ రిపోర్టు వచ్చే లోపు మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలని,హెల్త్ కార్డ్స్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని దీని వలన ఉద్యోగులు,పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారని బకాయిలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

