NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం అభివృద్ధి మరచిన పాలకులు,పీఠాధిపతులు

1 min read

మంత్రాలయం లో అంబేద్కర్ భవనం కొరకు స్థలం కేటాయించాలి

ఎస్సీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలి

ఎస్సి ఎస్టి బిసి మైనార్టీలను అభివృద్ధి చేయాలి

జై భీమ్ ఎమ్మార్పీఎస్  రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ

మంత్రాలయం  న్యూస్ నేడు :  మంత్రాలయం అభివృద్ధి ని పాలకులు, పీఠాధిపతులు మరిచిపోయారని వెంటనే అభివృద్ధి చేసేందుకఁ తమ వంతు కృషి చేయాలని జైభీమ్ ఎమర్పియస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ కోరారు. శుక్రవారం అంబేద్కర్ భవనం కొరకు స్థలం కేటాయించాలని , అలాగే ఎస్సీ గురుకుల పాఠశాల ను తక్షణమే ఏర్పాటు చేయాలని స్థానిక తహసీల్దార్ రమాదేవి, ఎంపిడిఓ నూర్జుహాన్ కు జిల్లా కార్యదర్శి హనుమన్న తో కలిసి వినతి పత్రం అందజేశారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మంత్రాలయంలోనిసర్వేనంబర్ 279లో 1.34,131/1 0.59,280/1B ,0.64 ఎకరములు ప్రభుత్వ భూమి  ఉందని ,ఇందులో 2 ఎకరాలు స్థలంను సర్వే చేయించి అంబేద్కర్ భవనం కొరకు స్థలం కేటాయించి , నిర్మాణం చేయాలన్నారు.మంత్రాలయం నియోజకవర్గ సమస్య లను ప్రజాప్రతినిధులు , రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు పట్టించుకోకపోవడంతోనే విద్య, వైద్యం, ఎస్సీ, బిసి మైనార్టీ ల అభివృద్ధి మూగబోయి దేశంలోనే నిరక్షరాస్యతలో  మొదటి స్థానం ఉందన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో బాలుర, బాలికలకు 6 నుండీ 12వ తరగతి వరకు చదువుకోవడానికి  ఎస్సీ గురుకుల పాఠశాలకు, స్థలం చూపించి, నిర్మాణం చేపట్టాలన్నారు.మంత్రాలయంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నారు.  బాలుర, బాలికల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.మంత్రాలయం నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి లేకపోవడంతో ప్రజలు కాన్పులు , క్యాన్సర్ల , గర్భవతుల, చిన్నచిన్న వ్యాధులు, తేలు,పాములు కరిస్తే,  రోడ్డు ప్రమాదాలు జరిగితే కర్నూల్ , ఎమ్మిగనూరులోని  ఆసుపత్రికి తీసుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని కొంతమంది మార్గమధ్యంలోనే చనిపోతున్నారని వాపోయారు ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్మంత్రాలయం నియోజకవర్గం నాయకులు అనిల్ కుమార్, మారెన్న, గోపాల్, సంగటి యోహాన్, జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం మండల అధ్యక్షులు  నరసింహులు, గర్జీ ప్రకాష్  మాదిగలు ,మంత్రాలయం మండల నాయకులు నరసింహులు ప్రకాష్ వగరూరు, వి. తిమ్మాపురం చెట్నాహల్లి సౌలహళ్లి, సూగురు గ్రామ నాయకులు,స్కూల్ విద్యార్థులు  పాల్గొన్నారు.

About Author