టీడీపీ కండువాలు కప్పుకున్న వైసీపీ కార్యకర్తలు
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : కోసిగి మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ గౌల్లా వెంకటేష్ , వందగల్ గోవిందు ,కురువ కృష్టప్ప , కురువ సుబ్బయ్య , హరిజన ఉలిగయ్య , భీమా, మైనారిటీ రజ్జు , కురువ లింగప్ప , హరిజన వీరేష్, రాఘవేంద్ర, పల్లెపాడు నరసింహ,వెంకటేష్, ఖాసీం, నబిసాబ్, శంకర్, భూంపల్లి సిద్ధాప్ప, బీరప్ప, హరిజన ఎల్లప్ప,కంకన్న,రామయ్య మరియు 30 కుటుంబాలశుక్రవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలోని తెదేపా పార్టీ కార్యాలయంలో టీడీపీ లోకి చేరారు. మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు మంచాల సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి పార్టీ లో చేరిన వారికి టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న రాష్ట్రాభివృద్ధికి ఆకర్షితులై , టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి పని తీరు చూసి టీడీపీలో చేరడం జరిగిందన్నారు.వైసీపీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లికార్జున, అయ్యప్ప, చిన్నారయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ నిత్యానంద,నారాయణ,పాల్గొన్నారు.

